దేశీయ స్టాక్ మార్కెట్ల పై డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం 25 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ లు బుధవారం రోజున స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. చైనా, కెనడా, మెక్సికోలపై కొత్త సుంకాలు విధిస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం తో అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 81.87 పాయింట్ల నష్టంతో 79,922 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 26.5 పాయింట్లు నష్టంతో 24,168 వద్ద కొనసాగుతోంది.